Rail: తెలతెలవారుతుండగా పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురి మృతి.. యూపీలో ఘటన

  • తెల్లవారుజామున 4.18 గంటలకు ప్రమాదం
  • పట్టాలు తప్పిన 13 బోగీలు
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని రైల్వే హామీ

ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పాట్నా నుంచి నడిచే రైలు మాణిక్‌పూర్ వద్ద ఈ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న 9 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

శుక్రవారం తెల్లవారుజామున మాణిక్‌పూర్ స్టేషన్ నుంచి బయలుదేరిన వాస్కోడిగామా-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు 4.18 గంటలకు పట్టాల తప్పింది. లక్నో సమీపంలో ఓ పాసింజర్ రైలును బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇది జరిగి 12 గంటలైనా కాకముందే పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 13 కోచ్‌లు పట్టాలు తప్పాయని చిత్రకూట్ ఎస్పీ ప్రతాప్ గోపేంద్ర సింగ్ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News