doklam: డోక్లాంలో కలకలం... రోడ్లు, సొరంగాలు, గోడ నిర్మించిన చైనా.. అప్రమత్తమైన భారత్!

  •  సొరంగాలు, బ్యారక్‌లు నిర్మిస్తున్న చైనా
  •  రోడ్లు, మౌలిక సదుపాయాలపై భారత్‌ దృష్టి
  •  భారీ యంత్రాలను తరలించిన భారత్

డోక్లాంలో మరోసారి కలకలం రేగింది. డోక్లాం సమీపంలో సొరంగాలు, బ్యారక్‌ ల వంటి భారీ నిర్మాణాలను చైనా చేపట్టింది. ఈ పనులు భారత బలగాలకు కనిపించకుండా 400 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మించడం విశేషం. వివాదాస్పద డోక్లాంలో సైనికులకు శాశ్వత స్థావరాల కోసం చైనా 16 బ్యారక్‌ లు, 6 సొరంగాలు తవ్విందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ప్రాంతానికి సమీపంలోని చైనా భూభాగంలో 200 అత్యాధునిక నిఘా వ్యవస్థ గల టెంట్లను ఏర్పాటు చేసినట్టు భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి.

దీంతో భారత్ కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ‘కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ (సీవోఈ)’ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆధునిక భారీ యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. సీవోఈకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) సిబ్బంది సాయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్వోను బలోపేతం చేయడం ద్వారా పనుల్లో వేగం పెంచాలని భావిస్తోంది. 

More Telugu News