Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త్రివిక్ర‌మ్‌ కొత్త సినిమా ప్రీలుక్ విడుద‌ల‌!

  • ప‌వ‌న్‌ దీర్ఘాలోచ‌న‌లో ఉన్న‌ట్లు  ప్రీలుక్‌
  • ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ ఈ నెల‌ 27న విడుద‌ల‌
  • ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ పేరును పెడ‌తార‌ని అభిమానుల అంచ‌నా

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ ఈ రోజు విడుద‌లైంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ఈ నెల‌ 27న వెల్లడించనున్నట్లు కూడా అందులో ఈ సినిమా యూనిట్ పేర్కొంది. ఉద‌యాన్నే కిటికీ వ‌ద్ద నిల‌బ‌డి సూర్యోదయాన్ని చూస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ దీర్ఘాలోచ‌న‌లో ఉన్న‌ట్లు ఈ ప్రీలుక్‌లో కనిపిస్తోంది.

ఈ సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే పేరును పెడ‌తార‌ని అభిమానులు భావిస్తున్నారు. జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి సూప‌ర్ హిట్‌ సినిమాల త‌రువాత త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ ల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  

More Telugu News