indian navy: భార‌త నేవీలో మొద‌టి మ‌హిళా పైలెట్‌గా నిలిచిన‌ శుభాంగి స్వ‌రూప్‌

  • కోర్సు పూర్తిచేసుకున్న‌ ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ మొద‌టి మ‌హిళ‌ల బ్యాచ్‌
  • యూపీలోని బ‌రేలీ ప్రాంతానికి చెందిన శుభాంగి
  • హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్‌లో శిక్ష‌ణ‌

బుధ‌వారం రోజు భార‌త‌ నేవీలో ఓ చారిత్రాత్మ‌క సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార‌త నావికా ద‌ళం త‌మ మొద‌టి మ‌హిళా పైలెట్‌ను ఎంపిక‌ చేసుకుంది. క‌న్నూర్‌లోని ఎళిమ‌ల ప్రాంతంలో ఉన్న ఇండియన్ నావ‌ల్ అకాడ‌మీలోని మొద‌టి మ‌హిళ‌ల బ్యాచ్ త‌మ చదువును పూర్తి చేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీ ప్రాంతానికి చెందిన శుభాంగి స్వ‌రూప్ మొదటి మ‌హిళ పైలెట్‌గా నిలిచింది. ఈమెతో పాటు మ‌రో 328 మంది కూడా ఉత్తీర్ణ‌త సాధించారు.

ఇండియ‌న్ నావీ, ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ల‌తో పాటు టాంజానియా, మాల్దీవుల క్యాడెట్‌ల‌కు చెందిన మ‌హిళ‌లు పైలెట్లుగా నావ‌ల్ ఆర్మ‌మెంట్ ఇన్‌స్పెక్ష‌న్ బ్రాంచ్‌లో నియ‌మితులయ్యారు. హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ ఎయిర్ ఫోర్స్ అకాడ‌మీలో శుభాంగి స్వ‌రూప్ శిక్ష‌ణ పొంద‌నుంది.

More Telugu News