snake: రైల్లో పాము... ధైర్యంగా తోకపట్టుకుని చంపిన యువకుడు, ఇప్పుడు ఇంట‌ర్నెట్ హీరో!

  • ఇండోనేషియాలో ఘ‌ట‌న‌
  • వైర‌ల్ అవుతున్న వీడియో
  • ఎవ‌రో ప్ర‌యాణికుడి బ్యాగులోంచి వ‌చ్చి ఉంటుంద‌ని అనుమానం

ఇండోనేషియాలో బోగోర్ నుంచి జ‌కార్తా వెళ్తున్న ఓ లోక‌ల్ ట్రైన్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. ఆ రైల్లో ప్ర‌వేశించిన పామును ధైర్యంగా తోక‌ప‌ట్టుకుని కొట్టి చంపిన యువ‌కుడిని ఇప్పుడు ఇంట‌ర్నెట్ లోకం హీరో అంటోంది. అయితే రైల్లోకి ఈ పాము ఎవ‌రో ఒక ప్ర‌యాణికుడి బ్యాగు నుంచే వ‌చ్చి ఉంటుంద‌ని రైల్వే అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బ్యాగులు పెట్టుకునే చోట న‌క్కిన పామును, వెన‌కాల బ్యాగు త‌గిలించుకున్న యువ‌కుడొక‌రు దాని తోక‌ప‌ట్టుకుని లాగి, ఒక్క‌సారిగా కింద కొట్టి చంప‌డం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఆ పాము విష‌పూరిత‌మైన‌దా? కాదా? అని తెలుసుకునేలోపే ఆ యువ‌కుడు పామును అలా చంప‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.  

More Telugu News