Tamilnadu: శశికళకు ఎన్నికల సంఘం షాక్.. రెండాకుల చిహ్నం ఈపీఎస్-ఓపీఎస్ వర్గానికే కేటాయింపు!

  • రెండాకుల చిహ్నం తమకు కేటాయించాలన్న శశికళ వర్గం
  • జయలలిత అసలైన వారసులం తామేనని వాదన
  • శశికళ వర్గం వాదనను తోసిపుచ్చిన ఎలక్షన్ కమీషన్
  • ఈపీఎస్- ఓపీఎస్ వర్గానికి అన్నాడీఎంకే అధికారిక చిహ్నం రెండాకులు కేటాయింపు

శశికళ వర్గానికి మరో షాక్ తగిలింది. గత వారం ఐటీ దాడుల నేపథ్యంలో భారీ ఎత్తున నగదు, నగలు పట్టుబడ్డాయంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలతో ప్రజల్లో పలుచనైన శశికళ వర్గం ప్రతిష్ఠ.. జాతీయ ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో మరింత దిగజారింది.

 అన్నాడీఎంకే పార్టీలో శశికళ అసలైన వారసులం తామేనని, తమకే పార్టీ అధికారిక చిహ్నం రెండాకుల గుర్తు కేటాయించాలని టీటీవీ దినకరన్ జాతీయ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే శశికళ వర్గం వాదనను తొసిపుచ్చిన ఎలక్షన్ కమీషన్ రెండాకుల గుర్తును ఈపీఎస్- ఓపీఎస్ వర్గానికి కేటాయించింది. దీంతో ఇంతవరకు జయలలితకు అసలైన వారసులం తామేనని ప్రచారం చేసుకుంటున్న శిశికళ వర్గానికి పెద్ద షాక్ తగిలినట్టైంది. 

More Telugu News