Revanth Reddy: వస్తున్నా.. ఇక పోరాటంలోకి దిగుతా: రేవంత్ రెడ్డి

  • టీఆర్ఎస్ అక్ర‌మాలను బ‌య‌ట‌పెడ‌తా
  • డిసెంబర్‌ 9వ తేదీ నుంచి వ‌స్తున్నా
  • డ్రగ్స్‌, పబ్స్‌ పెరిగిపోయాయి
  • డ్రగ్స్‌ సరఫరాదారులు కేసీఆర్ కుటుంబానికి దగ్గర వ్యక్తులే

తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన కొడంగ‌ల్ నేత‌ రేవంత్ రెడ్డి తాను ఇక టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటంలోకి దిగుతాన‌ని, వ‌చ్చేనెల 9వ తేదీ నుంచి వ‌స్తున్నాన‌ని అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... డ్ర‌గ్స్‌ సరఫరాదారులు కేసీఆర్ కుటుంబానికి దగ్గర వ్యక్తులేన‌ని ఆరోపించారు. డ్రగ్స్ కేసు విచారణ తీరును చూసి మొద‌ట‌ మధ్య తరగతి ప్రజలు సంతోషపడ్డారని, అయితే, విచారణ అనంతరం చర్యలు మాత్రం శూన్యం అని అన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్‌, పబ్స్‌ పెరిగాయని, ప్ర‌స్తుతం 59 పబ్‌లు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్‌ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్‌కు చెందిన ‘ఈవెంట్స్‌ నౌ’ అనే సంస్థకు హైటెక్స్‌, గచ్చిబౌలి మైదానాలను ‘సన్‌బర్న్‌’ పార్టీల నిర్వహణ కోసం స‌ర్కారు ఇచ్చేసింద‌ని ఆరోపించారు.

పబ్ లు, మ్యూజికల్ నైట్స్ డ్రగ్స్‌కు అడ్డాగా మారుతున్నాయని, ఎవరి ఒత్తిడులతో వాటికి అనుమతులు వ‌స్తున్నాయ‌ని రేవంత్ రెడ్డి నిల‌దీశారు. తెలంగాణ‌లో కొలువుల కొట్లాటకు అనుమతి రాదు కానీ, మాదక ద్రవ్యాలు వినియోగించే పార్టీలకు అనుమతి ఇస్తున్నార‌ని విమ‌ర్శించారు.

More Telugu News