b.tech: హీరోయిన్‌ల చిత్రాల‌ను మార్ఫింగ్ చేస్తోన్న బీటెక్ విద్యార్థి అరెస్టు

  • అమీర్ పేట‌లోని ఓ హాస్టల్ నుంచి ఫొటోల‌ను అప్‌లోడ్ చేస్తోన్న రాహుల్‌
  • ప‌లు వెబ్‌సైట్ల‌లో పోస్ట్ చేస్తోన్న నిందితుడు
  • మా అసోసియేష‌న్ ఫిర్యాదుతో అరెస్టు

సినీన‌టుల చిత్రాల‌ను మార్ఫింగ్ చేస్తోన్న రాహుల్ అనే బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అమీర్ పేట‌లోని ఓ హాస్ట‌ల్‌లో ఉంటోన్న రాహుల్ అక్క‌డి నుంచే ఈ ప‌ని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాహుల్‌ హీరోయిన్‌ల ఫొటోల‌ను ప‌లు వెబ్‌సైట్ల‌లో అప్‌లోడ్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. రాహుల్‌కి తాగుడు అల‌వాటు కూడా ఉంది. సినీన‌టుల చిత్రాల మార్ఫింగ్‌పై సీఐడీకి 'మా' అసోసియేష‌న్ ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలోనే పోలీసులు నిందితుల వేట‌ను ప్రారంభించారు. హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి న‌డుస్తోన్న‌ ప‌లు వెబ్‌సైట్లలో మార్ఫింగ్ ఫొటోలు ఉంటున్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

More Telugu News