nararohith: రెజీనాతో అఫైర్ అనేది ఓ పుకారు .. ఆ రూమర్ కి కారణం అదే అయ్యుంటుంది: నారా రోహిత్

  • రెజీనాతో 'శంకర' .. 'జ్యోఅచ్యుతానంద' చేసిన నారా రోహిత్ 
  • తాజాగా ఈ కాంబినేషన్లో 'బాలకృష్ణుడు'
  • అందులో నిజం లేదు .. అవన్నీ పుకార్లే

సాయిధరమ్ తేజ్ తో రెజీనా ఓ రెండు సినిమాలు చేయగానే, వాళ్లిద్దరూ లవ్ లో పడ్డారనే ప్రచారం మొదలైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే టాక్ ఇటీవల కూడా చాలా బలంగా వినిపించింది. ఇక రీసెంట్ గా రెజీనాతో నారా రోహిత్ కి ముడిపెడుతూ వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం అంతకంతకూ బలపడుతూ ఉండటంతో, తాజాగా నారా రోహిత్ స్పందించాడు.

"రెజీనాతో అఫైర్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ ప్రచారాన్ని నేను సీరియస్ గా తీసుకోవడం లేదు .. ఎందుకంటే ఇందులో ఎంతమాత్రం నిజం లేదు" అన్నాడు. "గతంలో మేమిద్దరం 'శంకర' .. 'జ్యో అచ్యుతానంద' సినిమాలు చేశాం .. తాజాగా 'బాలకృష్ణుడు' చేశాం. ఇలా మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేస్తుండటం ఈ పుకార్లకు కారణమయ్యుంటుంది. వృత్తిపరంగా కలిసి పనిచేయడం తప్ప ..మా మధ్య మరేమీ లేదు" అంటూ చెప్పుకొచ్చాడు. 'బాలకృష్ణుడు' ఈ నెల 24వ తేదీన విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.   

More Telugu News