sai dharam tej: కొరటాల సూచనలు 'జవాన్'కి కలిసొస్తాయా?

  • సాయిధరమ్ తేజ్ హీరోగా 'జవాన్' 
  • దర్శకుడు బీవీఎస్ రవికి కొరటాల సాయం
  • ఆయన సూచనల మేరకు రీ షూట్  
  • వచ్చేనెల 1వ తేదీన విడుదల  

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బీవీఎస్ రవి దర్శకత్వంలో 'జవాన్' సినిమా తెరకెక్కింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడుగా వ్యవహరించారు. సెప్టెంబర్ లోనే ఈ సినిమా విడుదల కావలసి వుంది. అయితే అవుట్ పుట్ సంతృప్తికరంగా అనిపించకపోవడంతో, దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ ను ఆపుతూ వచ్చారు.

ఈ నేపథ్యంలో బీవీఎస్ రవికి మంచి స్నేహితుడైన కొరటాల ఈ సినిమా విషయంలో ఆయనకి సహకరించారు. ఈ సినిమా అవుట్ పుట్ చూసి .. ఏయే సీన్స్ రీ షూట్ చేయాలో చెప్పాడట. ఆయన సూచనల మేరకే ఈ సినిమాలో సవరణలు జరిగాయని, ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను దిల్ రాజు చెప్పారు. కొరటాల శివకి ఇంతవరకూ అపజయమనేది తెలియదు. వరుసగా హిట్స్ ఇస్తూ వచ్చిన ఆయన పర్యవేక్షణలో 'జవాన్' వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చేనెల 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల సవరణలు ఈ సినిమాకి ఎంతవరకూ కలిసొస్తాయా చూడాలి.   

More Telugu News