nithin: పవన్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ .. ఊటీలో!

  • పవన్ బ్యానర్ పై నితిన్ సినిమా 
  • కథను అందించిన త్రివిక్రమ్ 
  • షూటింగ్ దశలో సినిమా 
  • త్వరలోనే టైటిల్ ఖరారు    

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ .. నితిన్ శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఒక సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. నితిన్ .. మేఘా ఆకాశ్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా, జూలై 24వ తేదీన సెట్స్ పైకి వచ్చింది. అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తోంది.

కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం ఊటీలో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ కథను అందించడం ప్రధాన బలంగా మారింది. ఇక తమన్ అందించిన సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని అంటున్నారు. త్రివిక్రమ్ .. పవన్ .. నితిన్ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయనున్నారు.   

More Telugu News