padmavathi: 'పద్మావతి' విషయంలో చరిత్రకారులను సంప్రదించనున్న సీబీఎఫ్‌సీ?

  • స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం
  • దేశ‌వ్యాప్తంగా ర‌గులుతున్న 'ప‌ద్మావ‌తి' వివాదం
  • విడుద‌ల‌పై సందిగ్ధం

నిజ‌జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీ తెరకెక్కించిన 'ప‌ద్మావ‌తి' చిత్రానికి స‌ర్టిఫికెట్ జారీ చేసే విష‌యంలో సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ స‌భ్యులు చరిత్ర‌కారుల‌ను సంప్ర‌దించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ కార‌ణంగా సినిమాకు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డంలో జాప్యం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

'ప‌ద్మావ‌తి' సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లైన ప‌ద్మావ‌తి, ర‌త‌న్ సింగ్‌, అల్లా ఉద్దీన్  ఖిల్జీల మ‌ధ్య ఉన్న సంబంధం గురించి స్ప‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కు సినిమా విడుద‌ల‌వుతుందో లేదోన‌న్న సందిగ్ధం ఏర్పడింది. ఈ సినిమాలో రాజ్‌పుత్ రాణుల‌ గౌర‌వాన్ని అగౌర‌వ‌ప‌రిచే స‌న్నివేశాలు ఉండి ఉంటాయని, చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడ‌ని రాజ్‌పుత్ సేన‌లు నిర‌స‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ ప్రాంతాల్లో ప్రారంభ‌మై ఇప్పుడు మొత్తం హిందువుల స‌మ‌స్య‌గా రూపాంత‌రం చెందిన ఈ వివాదానికి సీబీఎఫ్‌సీ నిర్ణ‌యంతోనే తెర‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

More Telugu News