nidhi aggarwal: ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కు 'నో' చెప్పిన చై హీరోయిన్!

  • చైతూ సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్
  • ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ ను తిరస్కరించిన నిధి
  • ఎంత డబ్బిచ్చినా చేయనంటూ స్పష్టీకరణ

సినీ తారలకు సినిమాల ద్వారానే కాకుండా, యాడ్స్ ద్వారా కూడా బోల్డంత ఆదాయం ఉంటుంది. కొన్ని క్షణాలు మాత్రమే కనిపించే ఈ యాడ్లకు వారు భారీగానే వసూలు చేస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో అభ్యంతరకరంగా వుండే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గా ఉండేందుకు పలువురు సెలబ్రిటీలు తిరస్కరిస్తున్నారు. ముఖ్యంగా పలువురు బాలీవుడ్ భామలు ఫెయిర్ నెస్ క్రీములకు ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు ఇప్పటికే అయిష్టత చూపారు.

తాజాగా ఈ జాబితాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. నాగచైతన్య సినిమా 'సవ్యసాచి'తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నిధి అగర్వాల్ కూడా ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ కు 'నో' చెప్పింది. ఎంత డబ్బు ఇచ్చినా... ఫెయిర్ నెస్ క్రీములకు ప్రచారకర్తగా పని చేయనని స్పష్టం చేసిందట. 'మున్నా మైఖేల్' సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన ఈ భామ... బాలీవుడ్ లో మంచి మార్కులే కొట్టేసింది. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉండటంతో... ఈమెకు బ్రాండ్ అంబాసడర్ గా పలు ఆఫర్లు వస్తున్నాయి. 

More Telugu News