recycle: ఇంట్లోని చెత్త‌తో విద్యుత్ త‌యారీ... ఆద‌ర్శంగా నిలుస్తున్న ముకేశ్ అంబానీ!

  • పొడి చెత్త‌తో విద్యుత్‌... త‌డి చెత్త‌తో ఎరువు
  • అంటీలియాలో చెత్త మొత్తం రీసైక్లింగ్‌
  • వ‌న‌రుల పున‌ర్వినియోగాన్ని ప్ర‌చారం చేస్తున్న అంబానీ కుటుంబం

అంటీలియా... ముకేశ్ అంబానీ ఇల్లు... ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఇళ్ల‌లో ఒక‌టి. ముంబైకి త‌ల‌మానికంగా ఉన్న ఈ ఇంట్లో 27 అంత‌స్తులు ఉన్నాయి. ఇందులో మొత్తం 600 మంది ఉద్యోగులు ప‌నిచేస్తారు. మూడు హెలీప్యాడ్లు, 168 కార్లు నిలిపే సామ‌ర్థ్యం గ‌ల పార్కింగ్, స్పా రూం, డ్యాన్సింగ్ స్టూడియో, థియేట‌ర్ రూం, టెర్రెస్ గార్డెన్స్‌, గుడి ఇంకా చాలా ఉన్నాయి. దీని విలువ దాదాపు రూ. 17 వేల కోట్లు ఉంటుంద‌ని అంచనా.

దీంతో ఆ ఇంటి నుంచి వ‌చ్చే చెత్త కూడా భారీగానే ఉంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. కానీ ఈ చెత్తనంతా ముకేశ్ అంబానీ కుటుంబం రోడ్ల మీదో, డంప్‌యార్డ్‌లోనో ప‌డేయ‌డం లేదు. దాన్ని మొత్తం రీసైకిల్ చేసి గృహ‌ విద్యుత్ అవ‌స‌రాల‌కు వినియోగిస్తున్నారు. ఇంట్లో చెత్త‌ను త‌డి, పొడి చెత్త‌లుగా విభ‌జించి పొడి చెత్త‌తో విద్యుత్‌, త‌డి చెత్త‌తో గార్డెన్‌కు ఎరువుల‌ను త‌యారుచేస్తున్నారు. ఇలా వ‌న‌రుల పున‌ర్వినియోగాన్ని ప్ర‌చారం చేస్తూ అంబానీ కుటుంబం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది.

More Telugu News