China: ఒకేసారి పది అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్షిపణి: చైనా సంచలన ప్రకటన

  • డాంగ్‌ ఫెంగ్‌–41 ను తయారు చేసి పరీక్షిస్తున్న చైనా
  • ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి వేటినైనా తునాతునకలు చేయగల సత్తా దీని సొంతం 
  • 12,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా

చైనా అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం వచ్చిచేరనుంది. ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయే ఖండాతర క్షిపణి వచ్చే ఏడాదికల్లా చైనా తయారు చేసి, పరీక్షిస్తున్నట్టు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఇది  ప్రపంచంలోని ఏ మూలనున్న లక్ష్యాలనైనా తాకగలదని గ్లోబల్ టైమ్స్ వెల్లడించిన కథనం పేర్కొంది.

డాంగ్‌ ఫెంగ్‌–41 గా పిలుస్తున్న అత్యాధునిక క్షిపణిని ఇప్పటికే ఏడు సార్లు ప్రయోగించినట్టు తెలిపింది. తొలిసారి దీని పరీక్షను 2012లో మొదలు పెట్టగా, 2018 ప్రథమార్థం నాటికి ఇది పూర్తి స్థాయిలో చైనాకు అందుబాటులోకి రానుంది. 12,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అలాగే మాక్‌ 10 కంటే వేగంగా దూసుకెళ్లడం దీని ప్రత్యేకత.

ప్రత్యర్థి క్షిపణి రక్షణ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి తన దారికి అడ్డువచ్చే వేటినైనా తునాతునకలు చేయగల సత్తా దీని సొంతమని తెలుస్తోంది. ఇందులో మూడంచెల ఘనరూప ఇంధన వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందువల్ల ఇది ఒకేసారి 10 అణ్వాయుధాల్ని మోసుకుపోయి వాటిని వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించగలదని గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది.   

More Telugu News