YSRCP: అనుమతి లేకుండా సదస్సు.. వైఎస్ జగన్, రోజా, కాటసాని రాంరెడ్డిలపై కేసు నమోదు!

  • పాదయాత్రలో అనుమతి లేకుండా మహిళా సదస్సు
  • తాము ఈ నెల 15నే తీసుకున్నామన్న నేతలు
  • 16న దానిని రద్దు చేస్తూ నోటీసులు  పంపారని ఆరోపణ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు రోజా, కాటసాని రాంరెడ్డిలపై బనగానపల్లె పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లా హుసేనాపురంలో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని ఆరోపిస్తూ ఐపీసీ సెక్షన్ 188, 30 పోలీస్ యాక్ట్  కింద కేసులు పెట్టారు.

సోమవారం హుసేనాపురంలో నిర్వహించిన మహిళా సదస్సులో జగన్, రోజా, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి పాల్గొన్నారు. పాదయాత్రలో మహిళా సదస్సు నిర్వహించేందుకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అయితే తాము ఈ నెల 15నే అనుమతి తీసుకున్నామని, 16న దానిని రద్దు చేస్తూ నోటీసులు  పంపారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

More Telugu News