boyapati: వచ్చేనెలలో బోయపాటితో సెట్స్ పైకి చరణ్!

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • స్క్రిప్ట్ పై చాలా రోజులుగా కసరత్తు
  • డిసెంబర్లో ఆరంభించే అవకాశం  

చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. సమంతా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరిపేసుకుంటోంది. ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో చరణ్ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 వచ్చేనెలలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. త్వరలోనే ముహూర్తాన్ని ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఉంటుందని చెబుతున్నారు. చాలా రోజులుగా బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాలో చరణ్ తో జత కట్టే నాయిక ఎవరో చూడాలి మరి.       

More Telugu News