nagachaitanya: 'శైలజా రెడ్డి అల్లుడు'లో చైతూకి అత్తగా శ్రీదేవి?

  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • చైతూ అత్త పాత్ర కోసం రమ్యకృష్ణతో సంప్రదింపులు
  • తాజాగా తెరపైకి శ్రీదేవి పేరు

ఒక వైపున చందూ మొండేటితో 'సవ్యసాచి' చేస్తోన్న నాగచైతన్య, మరో వైపున మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అత్త పాత్రకి అధిక ప్రాధాన్యత వుంటుందనే విషయం టైటిల్ ను బట్టి తెలిసిపోతోంది. దాంతో ఈ సినిమాలో అత్త పాత్ర కోసం రమ్యకృష్ణతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంలో శ్రీదేవి పేరు తెరపైకి వచ్చింది.

నాగార్జున జోడీగా చేసిన శ్రీదేవి .. చైతూకి అత్తగా చేస్తే ఈ ప్రాజెక్టుకు ఒక రేంజ్ లో క్రేజ్ వస్తుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. శ్రీదేవి ప్రధాన పాత్ర చేసినట్టయితే, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చునని భావిస్తున్నారట. అవసరమైతే నాగ్ మాట సాయం తీసుకుందామనే ఆలోచనలో మారుతి వున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్. ఫైనల్ గా ఈ సినిమాలో శైలజా రెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందో .. శ్రీదేవి మెరుస్తుందో చూడాలి.   

More Telugu News