Amitabh Bachchan: అమితాబ్‌ని తన సొంత తాత అనుకుంటున్న షారుక్ త‌న‌యుడు అబ్‌రామ్‌!

  • ట్వీట్‌లో వెల్ల‌డించిన షారుక్‌
  • ఆరాధ్య పుట్టిన‌రోజు వేడుక‌కి హాజ‌రైన షారుక్‌
  • ముగ్గురు క‌లిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన బిగ్ బీ

అమితాబ్ బ‌చ్చ‌న్ ఎప్పుడు టీవీలో క‌నిపించినా షారుక్ త‌న‌యుడు అబ్‌రామ్‌, ఆయ‌నను షారుక్ తండ్రి అనుకుంటాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాలీవుడ్ బాద్‌షా వెల్ల‌డించాడు. ఇటీవ‌ల జ‌రిగిన అభిషేక్‌, ఐశ్వ‌ర్య రాయ్‌ల కూతురు ఆరాధ్య పుట్టిన‌రోజుకి షారుక్‌, త‌న కుమారుడు అబ్‌రామ్‌తో కలసి హాజ‌ర‌య్యాడు. ఆ పార్టీలో అబ్‌రామ్ పీచు మిఠాయి కావాల‌ని అమితాబ్‌ని అడిగాడ‌ట‌. దాంతో అబ్‌రామ్‌ని పీచు మిఠాయి స్టాల్ వద్దకు తీసుకెళ్లి ఇప్పిస్తున్న ఫొటోను అమితాబ్ ట్వీట్ చేశాడు.

దానికి ప్ర‌తిగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ షారుక్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. `థాంక్యూ స‌ర్‌.. ఇది వాడి జీవితంలో చెప్పుకోద‌గిన క్ష‌ణం. అన్నట్లు.. వాడు మిమ్మ‌ల్ని టీవీలో చూసిన‌ప్పుడ‌ల్లా నా తండ్రి అనుకుంటాడు` అని షారుక్ ట్వీటాడు.

More Telugu News