kolkata test: కోల్ కతాలో సెంచరీ బాదిన కోహ్లీ.. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయిన లంక!

  • రెండో ఇన్నింగ్స్ ను 352 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్
  • 104 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కోహ్లీ
  • కుప్పకూలిన శ్రీలంక టాప్ ఆర్డర్

కోల్ కతాలో భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 352 పరుగుల వద్ద (8 వికెట్లు) డిక్లేర్ చేసింది. శ్రీలంక ముందు 231 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 104 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ ను మెరుగైన స్థితిలో నిలిపాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. సున్నా పరుగుల వద్దే ఓపెనర్ సమరవిక్రమను భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ చేశాడు.

అనంతరం నాలుగో ఓవర్లో 2 పరుగుల వద్ద మరో ఓపెనర్ కరుణరత్నే(1 పరుగు)ను షమీ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత తిరిమన్నేను భువనేశ్వర్ బలిగొన్నాడు. 7 పరుగులు చేసిన తిరిమన్నే రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రీలంక ప్రస్తుత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 14 పరుగులు. క్రీజులో మ్యాథ్యూస్ (6), చండిమాల్ (0) ఉన్నారు. శ్రీలంక విజయం సాధించాలంటే మరో 217 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే మరో 7 వికెట్లు తీయాలి.

More Telugu News