washing machine: త్వ‌ర‌లో త‌గ్గ‌నున్న గృహోప‌క‌ర‌ణాల ధ‌ర‌లు?

  • యోచిస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వం
  • జీఎస్టీ త‌గ్గింపుతో అందుబాటులోకి రానున్న ధ‌ర‌లు
  • ప్ర‌స్తుతం 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న గృహోప‌క‌ర‌ణాలు

త్వ‌ర‌లో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి పెద్ద గృహోప‌క‌ర‌ణాల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న వీటి శ్లాబును మార్చే యోచ‌న‌లో కేంద్ర‌ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జ‌రిగితే వీటి ధ‌ర‌లు భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. ఇటీవ‌ల సామూహిక, రోజువారీ వినియోగం ఉన్న వస్తువులపై పన్నులను తగ్గిస్తూ వస్తు-సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల మీద పన్ను ఎక్కువగా ఉండటంతో విక్రయాలు తగ్గిపోయాయని త‌యారీ సంస్థలు ఫిర్యాదు చేసిన కార‌ణంగా వీటిపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవలి సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా 28 శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులపై జీఎస్టీని త‌గ్గించారు. షాంపూలు, వాషింగ్‌ పౌడర్‌ డిటర్జెంట్‌, ఫేషియల్‌ మేకప్‌, చాక్‌లెట్లు, వెట్‌ గ్రైండర్లు, బ్యాటరీలు, చేతివాచీలు తదితర వాటిపై జీఎస్టీని 18 శాతం చేయ‌డంతో 28 శాతం శ్లాబులో కేవలం 50 వస్తువులే మిగిలాయి.

More Telugu News