dru presta: ఎత్తు మూడ‌డుగుల నాలుగించులు... వృత్తి మోడ‌లింగ్‌.. ఫ్యాష‌న్ రంగాన్ని దున్నేస్తోన్న ద్రు ప్రెస్టా!

  • అందానికి ఎత్తు కొల‌మానం కాద‌ని నిరూపించిన అమెరిక‌న్‌
  • మ‌రుగుజ్జు అయిన‌ప్ప‌టికీ మోడ‌ల్‌గా గుర్తింపు
  • ఆత్మ‌స్థైర్యం, సానుకూల దృక్ప‌థ‌మే కార‌ణ‌మంటున్న ద్రు ప్రెస్టా

మోడ‌ల్‌గా రాణించాలంటే అందంగా ఉండ‌టంతో పాటు మంచి ఎత్తు, శ‌రీరాకృతి ఉండాల‌నే సంప్ర‌దాయాల‌ను అమెరికాలో నెవాడా ప్రాంతానికి చెందిన ద్రు ప్రెస్టా తిర‌గ‌రాసింది. పుట్టిన‌పుడే ఎకాండ్రోప్లేసియా రావ‌డంతో ఆమె శ‌రీరం ఎద‌గ‌క మ‌రుగుజ్జులాగే మిగిలిపోయింది. ఇప్పుడు ఆమె ఎత్తు 3 అడుగుల 4 ఇంచులు... అయిన‌ప్ప‌టికీ ఒక మోడ‌ల్‌గా ఫ్యాష‌న్ రంగాన్ని దున్నేస్తోంది.

సానుకూల దృక్ప‌థం, ఆత్మ‌స్థైర్యం, చేసే ప‌ని మీద న‌మ్మ‌కం ఉంటే అందంగా క‌నిపించడానికి ఎత్తు కొల‌మానం కాద‌ని ద్రు నిరూపించింది. శారీర‌క లోపం కార‌ణంగా సంకుచిత భావంతో త‌మ‌లోని సామ‌ర్థ్యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డానికి భ‌య‌ప‌డేవారికి ఆమె ఆద‌ర్శంగా నిలుస్తోంది. మోడ‌లింగ్ రంగంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆమె ఆత్మ‌స్థైర్యం, న‌మ్మ‌కం, సానుకూల దృక్ప‌థాలు రెట్టింపు అయ్యాయ‌ని ద్రు చెబుతోంది.

మ‌రుగుజ్జు కావ‌డం వ‌ల్ల తాను ఎదిగే క్ర‌మంలో ఎంతోమంది త‌న‌ను అస‌హ్యించుకున్నార‌ని, ఎగ‌తాళి చేసే వారని ద్రు వెల్ల‌డించింది. దాదాపు 15 ఏళ్ల‌పాటు ఆమె అవ‌హేళ‌నకు గురైన‌ట్లు తెలిపింది. ఒక్క‌సారి ఆమె ఇన్‌స్టాగ్రాంలో ఫొటోల‌ను, వాటి కింద పోస్టులు చాలా అర్థాన్ని ప్ర‌తిబింబిస్తున్నాయి.

More Telugu News