chateswar pujara: టెస్టుల్లో అరుదైన రికార్డును సాధించిన పుజారా!

  • ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన పుజారా
  • ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ గా రికార్డు
  • ఇప్పటి వరకు తొమ్మిది మంది ఈ ఘనత సాధించారు

టీమిండియా స్టార్ టెస్ట్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు. ఒకే టెస్టులో ఐదు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన క్రీడాకారుల జాబితాలో చేరాడు. కోల్ కతాలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పుజారా ఈ ఘనతను సాధించాడు. మొత్తం ఐదు రోజుల పాటు పుజారా క్రీజులో బంతులను ఎదుర్కొన్నాడు. తద్వారా ఈ రికార్డును సాధించిన 9వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తద్వారా ఈ ఘనతను సాధించిన మూడో భారతీయుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

1960లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో హైదరాబాదీ ఆటగాడు జయసింహ ఇదే విధంగా ఐదు రోజుల పాటు క్రీజులోకి వచ్చాడు. ఆ మ్యాచ్ ను డ్రాగా ముగించాడు. 1984లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో రవిశాస్త్రి ఐదు రోజుల పాటు ఆడాడు. అయితే, ఇక్కడున్న మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... వీరు ముగ్గురూ ఈ ఘనతను ఈడెన్ గార్డెన్ లోనే సాధించారు. ఈ ఘనతను సాధించిన ఇతర ఆటగాళ్ల జాబితాలో జే బాయ్ కాట్, కేజే హ్యూస్, అలన్ లాంబ్, ఏఎఫ్జీ గ్రిఫిత్, ఆండ్ర్యూ ఫ్లింటాఫ్, ఏఎన్ పీటర్సన్ (దక్షిణాఫ్రికా)లు ఉన్నారు. 

More Telugu News