india: నిలదొక్కుకున్న ఇండియాకు షాకిచ్చిన లంక బౌలర్!

  • ఐదో రోజుకు చేరిన టెస్ట్ క్రికెట్
  • 79 పరుగుల వద్ద రాహుల్ క్లీన్ బౌల్డ్
  • భారత స్కోరు 51 ఓవర్లలో 209/2

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఆట నాలుగో రోజున ఒక వికెట్ నష్టానికి 171 పరుగులు చేసి, చివరిదైన ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు లంక బౌలర్ లక్మల్ ఆదిలోనే షాకిచ్చాడు. లక్మల్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని అంచనా వేయడంలో పొరపాటు చేసిన రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 125 బంతులాడిన రాహుల్ 8 బౌండరీల సాయంతో 79 పరుగులు చేశాడు.

అంతకుముందు పుజారా మూడు బౌండరీలు సాధించి, వేగంగా పరుగులు సాధించాలన్న తన ఉద్దేశాన్ని చెప్పినప్పటికీ, వికెట్ కోల్పోవడంతో కాస్తంత నిదానించాడు. ప్రస్తుతం కోహ్లీ 11, పుజారా 20 పరుగులతో ఆడుతుండగా, భారత స్కోరు 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు. భారత జట్టు 86 పరుగుల లీడింగ్ లో ఉంది. ఈ పరిస్థితుల్లో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే అధికం.

More Telugu News