Nagarjuna: వర్మ తాజా చిత్రం స్టిల్స్: యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ లో నాగార్జున.. మాటల్లో చెప్పలేకపోతున్నానన్న నాగ్!

  • నాగార్జున, వర్మ కాంబినేషన్ లో న్యూ మూవీ
  • ఫొటోలు షేర్ చేసుకున్న నాగ్
  • 28 ఏళ్ల నాటి కాంబినేషన్ రిపీట్ అంటూ ట్వీట్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఓ సినిమా తయారవుతోందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫొటో షూట్ జరుగగా, ఆ చిత్రాలను నాగ్ అభిమానులతో పంచుకున్నారు. గన్ పట్టుకుని సీరియస్ గా చూస్తున్న నాగ్ లుక్స్ సూపర్బ్ గా ఉన్నాయి.

"28 సంవత్సరాల క్రితం 'శివ' అనే సినిమా నా జీవితాన్ని మార్చింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో చిత్రం. మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతోంది. జీవితంలో నిత్యమూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా" అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. నాగ్ చేసిన ట్వీట్ ను మీరూ చూడవచ్చు.

More Telugu News