జగన్: జగన్ కోసం జైలు గోడలు ఎదురు చూస్తున్నాయి: ప్రత్తిపాటి పుల్లారావు

  • జైలుకు వెళ్లకుండా ఉండాలని చూస్తున్న జగన్
  • బాబు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: పుల్లారావు
  • సాధ్యం కాని హామీలిచ్చిన జగన్: కామినేని
  • జగన్ హామీలు నెరవేర్చాలంటే నాలుగు రాష్ట్రాల బడ్జెట్లు కూడా సరిపోవు: ఆదినారాయణరెడ్డి

జగన్ కోసం జైలు గోడలు ఎదురు చూస్తున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏదో విధంగా జైలు బయట ఉండాలనేది జగన్ తాపత్రయం అని, చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలూ సంతోషంగా ఉన్నారని అన్నారు. మరో మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ పది రోజుల్లో రూ.1.5 లక్షల కోట్ల విలువైన సాధ్యం కాని హామీలిచ్చారని, బంగారు పళ్లెంలో అన్నం పెడతామని చెబితే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. నమ్మించి వంచించిన కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే వైసీపీకీ పడుతుందని విమర్శించారు.

 కాగా, కడప జిల్లా రాజంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, జగన్ హామీలు నెరవేర్చడానికి నాలుగు రాష్ట్రాల బడ్జెట్లు కూడా సరిపోవని, అధికారం కోసం జగన్ ఎన్ని హామీలైనా గుప్పిస్తాడని, ఆయన పాదయాత్ర రోడ్డుకే పరిమితమైందని, ప్రశాంత్ కిశోర్ నే వైసీపీ నమ్ముకుంటే నంద్యాల ఫలితమే పునరావృతమవుతుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రతి ఇంటి తలుపు తట్టి సమస్యలు పరిష్కరిస్తోందని. రైతు రుణమాఫీ చక్కగా అమలవుతోందని అన్నారు.

More Telugu News