mohan goteti: లెజండ్, రేసుగుర్రం కళాఖండాలా?: సినియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మోహన్ గోటేటి

  • కళాత్మక చిత్రాలను మరచి కమర్షియల్ వైపు
  • కొన్ని పేర్ల కారణంగానే వివాదాలు
  • రుద్రమదేవికి అన్యాయం జరిగింది
  • 2011 నంది అవార్డుల కమిటీ మెంబర్ మోహన్ గోటేటి

ఒకేసారి మూడు సంవత్సరాల అవార్డులను ప్రకటించడంతోనే ప్రస్తుతం నంది అవార్డులపై వివాదం చెలరేగుతోందని, కళాత్మక చిత్రాలకు అవార్డులను మరచి, కమర్షియల్ వైపు ఎన్నడో అడుగులు పడ్డాయని సినియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, 2011 నంది అవార్డుల కమిటీ మెంబర్, గతంలో నంది అవార్డును గెలుచుకున్న మోహన్ గోటేటి వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో పాల్గొన్న ఆయన, కేవలం కొన్ని చిత్రాల పేర్లే వివాదాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. లెజండ్, రేసుగుర్రం చిత్రాలు కళాఖండాలేమీ కాదని చెప్పారు. మంచి సినిమాలను వదిలేశారని తాను అనడం లేదని, రేసుగుర్రం చాలా పాప్యులర్ అయిన చిత్రమని, బన్నీ చాలా బాగా చేశాడని చెబుతూ, ఆ సినిమాను విస్మరించడంతో ఫ్యాన్స్ అప్ సెట్ అయ్యారని అభిప్రాయపడ్డారు. ఆ చిత్రాన్ని ఓ అవార్డుకు కన్సిడర్ చేసుండాల్సిందని చెప్పారు. కేవలం దరఖాస్తు చేసుకున్న విభాగంలో కాకుండా, మరో విభాగంలో జ్యూరీ అవార్డు ఇచ్చే అధికారం ఉందని తెలిపారు. 'రుద్రమదేవి'కి నిజంగా అన్యాయం జరిగిందని పేర్కొన్న ఆయన, తెలుగు వీర వనితగాధను చాలా బాగా తీశారని, చిత్రంలో కొన్ని తప్పులుండవచ్చని, ఎవరూ చేయని ప్రయత్నం చేసిన గుణశేఖర్ కు అవార్డు ఇచ్చుంటే బాగుండేదని అన్నారు.

More Telugu News