writer rajender kumar: రెడ్లలో సురేందర్ రెడ్డికి, కమ్మలో రాజమౌళికి అవార్డులిచ్చామన్న స్థితి రావాలా? ఈ పెంట వద్దనుకుంటే అవార్డులనే రద్దు చేద్దాం: రచయిత రాజేందర్ కుమార్

  • అన్ని విషయాలనూ బేరీజు వేసుకునే అవార్డులు
  • రెండు చిత్రాలను పోలిస్తే ఒకదానికే గుర్తింపు లభిస్తుంది
  • కులాల ప్రాతిపదికన అవార్డులు ఇచ్చే పరిస్థితి తేవద్దు
  • రచయిత రాజేందర్ కుమార్

నంది అవార్డుల కమిటీ అన్ని విషయాలనూ బేరీజు వేసుకునే అవార్డులను ప్రకటించిందని, ఇందులో ఎలాంటి విభేదాలకూ తావు లేదని రచయిత రాజేందర్ కుమార్ వ్యాఖ్యానించారు. 'లెజండ్'కు 9 అవార్డులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ సినిమాకు పనిచేసిన గొప్ప టెక్నీషియన్స్ నైపుణ్యాన్ని కించపరచవద్దని అన్నారు. గతంలో నాగేశ్వరరావు అద్భుతంగా నటించిన 'సీతారామయ్యగారి మనవరాలు', రాజేంద్రప్రసాద్ 'ఎర్రమందారం' పోటీ పడితే ఉత్తమ నటుడి అవార్డు రాజేంద్రప్రసాద్ కు దక్కిందని అన్నారు.

కోడి రామకృష్ణ సమాజానికి సందేశం ఇస్తూ, అద్భుతంగా 'అంకుశం' తీస్తే, ఆయనకు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించలేదని, ఆ సంవత్సరం అవార్డు 'గీతాంజలి'కిగాను మణిరత్నంకు లభించిందని గుర్తు చేశారు. ఇకపై నంది అవార్డులు రెడ్లకు 4, కమ్మవాళ్లకు 3, బ్రాహ్మలకు 12... అంటూ కులాల ప్రాతిపదికన విభజించాలా? అని రాజేందర్ ప్రశ్నించారు. రెడ్ల నుంచి సురేందర్ రెడ్డికి, కమ్మ వారిలో రాజమౌళికి అవార్డులు ఇస్తున్నామని జ్యూరీ చెప్పాలని మీరు భావిస్తున్నారా? అని అవార్డులను విమర్శిస్తున్న వారి ముందు సూటి ప్రశ్నలు ఉంచారు. ఆసలీ పెంటే వద్దని భావించి, నంది అవార్డులనే రద్దు చేసే పరిస్థితి తేవద్దని అన్నారు.

More Telugu News