allani sridhar: బోయపాటి దగ్గర లేనిదేంటి? రాంగోపాల్ వర్మ దగ్గర ఉన్నదేంటి? ఆయనేమైనా సచ్చరిత్రుడా?: దర్శకుడు అల్లాణి శ్రీధర్ ప్రశ్నాస్త్రాలు

  • ఎప్పుడూ రాని విమర్శలు వస్తున్నాయి
  • వ్యక్తిగత విమర్శలు ఉండరాదు
  • కళాత్మక చిత్రాలకు దక్కని గుర్తింపు
  • దర్శకుడు అల్లాణి శ్రీధర్

గతంలో ఎన్నో ప్రభుత్వాలు నంది అవార్డులను ఇవ్వగా, ఎన్నడూ రాని విమర్శలు ఇప్పుడు వస్తున్నాయని, కొంతమంది వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, చులకన అవుతున్నారని దర్శకుడు అల్లాణి శ్రీధర్ వ్యాఖ్యానించారు. వ్యవస్థపై విమర్శలు తప్పులేదని, వ్యక్తిగత విమర్శలు వద్దని చెబుతూ, ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, జేమ్స్ కామెరూన్ అవార్డును తెచ్చి బోయపాటి శ్రీను కాళ్ల వద్ద పెట్టాలని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.

బోయపాటి శ్రీను దగ్గర లేనిదేంటి? రాంగోపాల్ వర్మ దగ్గర ఉన్నదేంటి? అని ప్రశ్నిస్తూ, ఆయనేమీ సచ్చరిత్రుడు కాదని ఎద్దేవా చేశారు. కళాత్మక సినిమాలకు ఇవ్వాల్సిన సినిమాలు కమర్షియల్ సినిమాలకు మారాయన్నది మాత్రం నిజమని అన్నారు. జ్యూరీ సభ్యుల ఎంపిక కూడా పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇప్పుడున్నవాళ్లంతా సత్తా లేని వాళ్లు కాదని, 2014పైనే ఎక్కువ విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. గతంలో జ్యూరీలో సభ్యుడిగా ఉన్న తనకు, ఇప్పుడిలా అవార్డులపై వివాదాలు రావడం బాధను కలిగిస్తోందని చెప్పారు. అవార్డులు ఇచ్చే కమిటీకి, ప్రభుత్వానికి సంబంధం ఉండదని అన్నారు. ఎవరు సీఎంగా ఉన్నా సీల్డ్ కవర్ లోనే జాబితా ఆయన ముందుకు వెళ్లేదని వివరించారు.

More Telugu News