India: ఇండియన్ స్టూడెంట్ ఫొటోను మార్ఫింగ్ చేసి అడ్డంగా దొరికి పోయిన పాకిస్థాన్... అసలు, నకిలీ ఫొటోలు ఇవే!

  • సోషల్ మీడియాలో ఇండియాకు వ్యతిరేకంగా పోస్టులు
  • భారత అమ్మాయి అభిప్రాయమంటూ మార్ఫింగ్ ఫొటో
  • కనిపెట్టేసిన నెటిజన్లు
  • పాకిస్థాన్‌ డిఫెన్స్‌ ఫోరమ్‌ సోషల్ మీడియా ఖాతాల స్తంభన

సామాజిక మాధ్యమాల్లో ఇండియాను ఇబ్బంది పెట్టాలని చూసిన పాకిస్థాన్, తన వక్రబుద్ధిని బయటపెట్టి మరోసారి అడ్డంగా దొరికిపోయింది. ఇండియాకు వ్యతిరేకంగా భారత విద్యార్థిని పెట్టిన ఓ పోస్టు అంటూ, మార్ఫింగ్ చేసిన ఫొటోను పాక్ నుంచి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా, ఆ దేశపు కుతంత్రాన్ని నెటిజన్లు బయటపెట్టారు. ఢిల్లీ వర్సిటీకి చెందిన కవాల్‌ ప్రీత్‌ కౌర్ అనే లా స్టూడెంట్, ఈ సంవత్సరం జూన్ లో ఓ ప్లకార్డు పట్టుకుని దిగిన ఫొటోను పోస్టు చేసింది.

భారతీయులుగా రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని గౌరవించాలని కోరుతూ, ముస్లిం ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించాలని ప్లకార్డుపై రాసి, జమా మసీద్‌ వద్ద  ఈ ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టింది. ఇక దీన్ని మార్ఫింగ్ చేసిన పాక్‌ డిఫెన్స్‌ తన అధికారిక పేజీలో షేర్‌ చేసుకుంది. ప్లకార్డుపై ఉన్న మాటలను, నేను భారతీయురాలినే అయినా, భారత్‌ అంటే తనకు ఇష్టం లేదని, వలసవాదాలకు ఇది కేరాఫ్‌ అడ్రస్‌ అని, నాగాలు, కశ్మీరీలు, మణిపూరీలు, హైదరాబాదీలు ఆక్రమించుకున్న దేశమని మార్చింది. ఇది ఫేక్ ఫొటో అని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక భారత్‌ కు వ్యతిరేకంగా ఫేక్‌ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడంతో పాకిస్థాన్‌ డిఫెన్స్‌ ఫోరమ్‌కు చెందిన ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాలు శనివారం నుంచి స్తంభించిపోయాయి.

More Telugu News