Allu Arjun: యాక్షన్ సీన్స్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోతోన్న బన్నీ

  • బన్నీ తాజా చిత్రంగా ' నా పేరు సూర్య'
  • హైదరాబాద్ లో షూటింగ్ 
  • యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ 
  • ఏప్రిల్ 27న విడుదల    

అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చిత్రం తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే ఊటీలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ చే విజిల్స్ వేయించేలా ఈ ఫైట్స్ వుంటాయని అంటున్నారు. ఆర్మీ అధికారిగా బన్నీ కనిపించే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనీ .. దర్శకుడిగా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని వక్కంతం వంశీ భావిస్తున్నాడు.    

More Telugu News