Aadhar: వంద కోట్ల ఆధార్.. 100 కోట్ల బ్యాంకు ఖాతాలు.. వంద కోట్ల మొబైల్స్.. లింకేజీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్న కేంద్రం!

  • మూడీస్ రేటింగ్‌తో ఉత్సాహంలో మోదీ ప్రభుత్వం
  • సరికొత్త లక్ష్యంతో ముందుకు..
  • గడువు లేకున్నా.. వీలైనంత త్వరగా పూర్తిచేసే యోచన

వంద కోట్ల ఆధార్ కార్డులను 100  కోట్ల బ్యాంకు ఖాతాలు, వంద కోట్ల మొబైల్స్‌తో అనుసంధానం చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా గడువు పెట్టుకోకున్నా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇండియా బాండ్ రేటింగ్‌ను మూడీస్ అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోంది.

దాదాపు 14 ఏళ్ల తర్వాత భారత బాండ్ రేటింగ్‌ను మూడీస్ 30 పాయింట్లు పెంచడంతో ఊపుమీదున్న మోదీ ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆధార్ అనుసంధానాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వంద కోట్ల బ్యాంకు ఖాతాలను వంద కోట్ల ఆధార్ నంబర్లు, వంద కోట్ల మొబైల్ ఫోన్లతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కచ్చితమైన గడువును నిర్దేశించకున్నా వీలైనంత త్వరలోనే లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. కాగా, భారత్ రేటింగ్‌ను మూడీస్ చివరిసారి 2004లో అప్‌గ్రేడ్ చేసింది.

More Telugu News