Nawaz sharif: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కొత్త కష్టాలు.. ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌కు ఎక్కిన పేర్లు

  • ఈసీఎల్‌కు ఎక్కిన నవాజ్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు
  • దేశం విడిచిపారిపోకుండా ముందస్తు చర్య
  • జూలైలో ప్రధాని పదవిని కోల్పోయిన నవాజ్

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పనామా పేపర్ల కుంభకోణంలో చిక్కుకుని పదవి కోల్పోయిన ఆయన ఇకపై దేశం విడిచి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. షరీఫ్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లను ప్రభుత్వం ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌లో చేర్చింది.

షరీఫ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు లండన్‌లో ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఈ ఏడాది జూలైలో పాక్ సుప్రీంకోర్టు నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో నవాజ్ ఆయన కుటుంబ సభ్యులు, అల్లుడిపై నేషనల్ అకౌంట‌బులిటీ బ్యూరో (ఎన్ఏబీ) సెప్టెంబరులో మొత్తం 8 కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వారు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించే ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ఈసీఎల్)లో షరీఫ్, ఆయన కుమారులు హుస్సేన్, హసన్, కుమార్తె మర్యమ్, అల్లుడు మొహమ్మద్ సఫ్దర్  పేర్లను చేర్చారు.

More Telugu News