padmavati: దీపికా ప‌దుకునే విష‌యంలో జ‌రుగుతోన్న ప‌రిణామాలను తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యా: హాలీవుడ్ నటి

  • ప‌ద్మావ‌తి సినిమాలో న‌టించిన దీపికా ప‌దుకునేని చంపేయాల‌ని హెచ్చ‌రిక‌లు
  • స్పందించిన హాలీవుడ్ న‌టి రూబీ రోస్
  • దీపిక చేస్తోన్న‌ పోరాటానికి హాట్సాఫ్
  • నాకు తెలిసిన ధైర్యవంతమైన మహిళలలో దీపిక ఒక‌రు  

దీపికా ప‌దుకునే న‌టించిన బాలీవుడ్ సినిమా పద్మావతిని వివాదాలు చుట్టుముట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీపికా ప‌దుకునేని చంపేయాల‌ని, ఆమె ముక్కుకోయాల‌ని రాజ్‌పుత్ క‌ర్ణిసేన వ్యాఖ్య‌లు చేస్తోంది. ఈ వివాదం గురించి తెలుసుకుని తాను దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని హాలీవుడ్ నటి రూబీ రోస్ ట్వీట్ చేసింది. ఆమధ్య దీపికా ప‌దుకునే న‌టించిన‌ హాలీవుడ్‌ చిత్రం 'ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్స్‌ ఆఫ్‌ క్జాండర్‌ కేజ్‌'లో రూబీ రోస్‌ కూడా నటించారు. త‌న‌ స్నేహితురాలి విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకున్నాన‌ని, ఆమె చేస్తోన్న‌ పోరాటానికి హాట్సాఫ్ అని రూబీ పేర్కొంది. త‌న‌కు తెలిసిన ధైర్యవంతమైన మహిళలలో దీపిక ఒకరని మ‌ద్ద‌తు తెలిపింది.

More Telugu News