shivabalaji: హిట్ కొడితే గ్రాఫ్ పెరగాలి .. కానీ నా విషయంలో అలా జరగలేదు: శివబాలాజీ

  • 'చందమామ'తో హిట్ వచ్చింది  
  • అయినా మంచి అవకాశాలు రాలేదు
  • హిట్స్ తరువాత నా గ్రాఫ్ ఎప్పుడూ పెరగలేదు

హీరో పాత్రలతో పాటు .. ముఖ్యమైన పాత్రలను చేస్తూ శివబాలాజీ తన కెరియర్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి కారణమేంటనే ప్రశ్న 'ఐ డ్రీమ్స్' ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. '' ఒక ప్రొడక్టును చూపించినట్టుగా నేను వెళ్లి నన్ను నేను పరిచయం చేసుకుని నా గురించి చెప్పుకోను .. అది నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు" అన్నారు.

 "ఇతరులతో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన తరువాతనే వాళ్లతో నేను కలిసిపోగలుగుతాను. లేదంటే పెద్ద చనువుగా ఉండను గానీ, అందరినీ గౌరవిస్తాను. పోటీ వుంది కదా అని నా ఆత్మాభిమానాన్ని వదిలేసి నేను వెళ్లలేను. నేను ఇంతవరకూ చేసిన సినిమాలు 21 వరకూ ఉంటాయి. వాటిలో బాగా గుర్తింపు తీసుకొచ్చినవి ఓ 5 వరకూ ఉంటాయి. ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వెళుతూ ఉంటేనే నిన్ను గుర్తు పెట్టుకుంటారు .. లేదంటే మరిచిపోతారు అనేవారు. దాంతో వచ్చిన అవకాశాలు వదలకుండా చేస్తూ వెళ్లాను. 'చందమామ' వంటి హిట్ పడిన తరువాత కూడా నేను 'శంభో శివ శంభో' చేయడానికి రెండేళ్లు పట్టింది. ఎందుకో తెలియదు గానీ, హిట్ పడినా నా గ్రాఫ్ పెరిగేది కాదు" అంటూ చెప్పుకొచ్చారు.   

More Telugu News