Bill Gates: నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను!: బిల్ గేట్స్ భార్య మెలిందా

  • #metoo ప్ర‌చారంలో తాను కూడా భాగ‌మేన‌ని వ్యాఖ్య‌
  • టెక్ ప‌రిశ్ర‌మ కూడా అందుకు తీసిపోలేద‌న్న మెలిందా
  • ప్ర‌పంచంలో అన్ని చోట్ల ఈ స‌మ‌స్య ఉంద‌న్న బిల్‌గేట్స్ స‌తీమ‌ణి

బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేష‌న్ స‌హ‌-వ్య‌వ‌స్థాప‌కురాలు, బిల్ గేట్స్ భార్య మెలిందా గేట్స్... తాను కూడా లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు వెల్ల‌డించింది. గ‌త నెల ప్రారంభ‌మైన #metoo ప్రచారంలో తాను కూడా భాగ‌మేన‌ని ఆమె ప్ర‌క‌టించింది. 'నేను కూడా వ్య‌క్తిగ‌తంగా లైంగిక వేధింపుల‌కు గుర‌య్యాను. టెక్ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తున్న‌పుడు నాకు ఆ అనుభ‌వం ఎదురైంది. అమెరికాలో మ‌హిళ‌ల స‌మానావ‌కాశాల డేటాను ప‌రిశీలిస్తే దాదాపు 85 శాతం మంది మ‌హిళ‌లు ప‌నిచేసే చోట‌ లైంగిక వేధింపుల‌కు గురైన విష‌యం బ‌ట్ట‌బ‌య‌ల‌వుతోంది. నేనూ వాళ్ల‌లో ఒక‌దాన్నే' అని మెలిందా తెలిపింది. ఈ స‌మ‌స్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉందని, #metoo ప్ర‌చారం వ‌ల్ల ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన అన్యాయం గురించి నోరు విప్పుతున్నార‌ని ఆమె పేర్కొన్నారు.

More Telugu News