hardhik patel: అర్ధ‌రాత్రిలోగా మా డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలి.. అంతే!: కాంగ్రెస్‌కి హార్ధిక్ ప‌టేల్ అల్టిమేటం

  • గుజ‌రాత్‌లో ద‌గ్గ‌ర‌ప‌డ్డ‌ అసెంబ్లీ ఎన్నిక‌లు
  • 30 అసెంబ్లీ స్థానాల్లో మా మద్దతుదారులకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇవ్వాలి
  • ఈ డిమాండ్‌కు ఒప్పుకుంటేనే కాంగ్రెస్‌కు మద్దతు

ఈ రోజు అర్ధ‌రాత్రిలోగా తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ప‌టీదార్‌ ఉద్యమనేత హార్థిక్‌ పటేల్‌ అల్టిమేటం ఇచ్చారు. గుజ‌రాత్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. త‌మ రాష్ట్రంలో పటేల్‌ సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ కల్పించాల‌ని హార్ధిక్ ప‌టేల్ డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ డిమాండ్‌ల‌లో ప్ర‌ధానంగా 30 అసెంబ్లీ స్థానాల్లో తమ మ‌ద్ద‌తుదారులకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇవ్వాలని ఆ సామాజిక వ‌ర్గం డిమాండ్ చేస్తోంది.

ఈ డిమాండ్‌కు ఒప్పుకుంటేనే తాము కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతామని స్ప‌ష్టం చేస్తోంది. మ‌రోవైపు కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప‌టీదార్ వ‌ర్గానికి అన్ని సీట్లు ఇవ్వడానికి అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్ద‌ల‌తో హార్ధిక్ ప‌టేల్ మ‌ద్ద‌తుదారులు చ‌ర్చిస్తున్నారు. త‌మ డిమాండ్లపై కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు అర్ధ‌రాత్రిలోగా ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే తమ మద్దతు అవసరం లేదని భావించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

More Telugu News