gunashekar: జీవిత రాజ‌కీయ లబ్ది ఆశిస్తున్నారు.. ఆమెపై గౌర‌వం పోయింది: ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఆగ్ర‌హం

  • అవార్డుల‌ను ప్ర‌క‌టించిన త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చి జీవిత మీడియాతో మాట్లాడారు
  • టీడీపీలో చేరితే చేర‌తాన‌ని వ్యాఖ్యానించారు
  •  రాజకీయ లబ్ధి ఆశించే వారికి జ్యూరీలో స్థానం కల్పించటం ఏంటి?

నిన్న‌టి నుంచి త‌న‌కు చాలా మంది ఫోన్‌లు చేస్తున్నారని, నంది అవార్డుల వివాదంపై స్పందించాల‌ని అడుగుతున్నార‌ని ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ అన్నారు. నంది అవార్డుల వివాదంపై గుణ‌శేఖ‌ర్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ..  జీవిత అంటే త‌న‌కు ఎంతో గౌర‌వం ఉండేద‌ని అన్నారు. అవార్డుల ప్ర‌క‌ట‌న పూర్తయ్యాక జీవిత బ‌య‌ట‌కు వ‌చ్చి చంద్ర‌బాబు నాయుడు, టీడీపీపై మాట్లాడారని అన్నారు. టీడీపీ నాయ‌కులు చేర‌మంటే ఆ పార్టీలో చేర‌తాన‌ని ఆమె వ్యాఖ్యానించారని గుర్తు చేస్తూ, ఈ మాట‌తోనే జీవిత‌పై గౌర‌వం, విశ్వ‌స‌నీయ‌త పోయాయని ఆయన అన్నారు.

తాను తీసిన రుద్రమదేవి సినిమాకు ఏపీ నుంచి పన్ను రాయితీ కూడా రాలేద‌ని అన్నారు. అప్ప‌ట్లో తాను నిబంధనల ప్రకారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే అక్టోబర్ 8న తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు పన్ను మినహాయింపు కోసం ద‌ర‌ఖాస్తు చేశానని తెలిపారు. నంది అవార్డు కమిటీ నిర్ణయాలను ప్రశ్నిస్తే మూడేళ్ల పాటు వారిని అవార్డులకు అనర్హులుగా ప్రకటిస్తామనే నిబంధన సరైంది కాదని గుణ‌శేఖ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. అవార్డుల జ్యూరీలో అంతా సినిమా వాళ్లే ఉండటం కరెక్ట్ కాదని అన్నారు. అలాగే రాజకీయ లబ్ధి ఆశించే వారికి జ్యూరీలో స్థానం కల్పించటం ఏంట‌ని గుణశేఖర్ ప్ర‌శ్నించారు.

More Telugu News