nandi: నంది అవార్డుల వివాదంపై బాలకృష్ణ‌ స్పంద‌న!

  • బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు
  • వివాదాలు వ‌ద్దు- బాల‌య్య‌
  • స‌మష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజ‌య‌వంతం
  • నంది అవార్డులు ఎంపిక చేసిన వారికి కృత‌జ్ఞ‌త‌లు

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది అవార్డుల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ న‌టించిన లెజెండ్ సినిమాకు 9 అవార్డులు రావ‌డాన్ని ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు. తాను న‌టించిన‌ సినిమాకు నంది రావ‌డం ప‌ట్ల బాల‌కృష్ణ స్పందించారు. నంది అవార్డుల విష‌యంలో ఎటువంటి వివాదాలు వ‌ద్దని అన్నారు. స‌మష్టి కృషితోనే లెజెండ్ సినిమా విజ‌య‌వంతం అయింద‌ని తెలిపారు.

అంద‌రూ క‌ష్ట‌ప‌డ్డారు కాబ‌ట్టే తాను న‌టించిన సినిమాకు 9 అవార్డులు వ‌చ్చాయని అన్నారు. మాట‌ల‌తో కాదు చేత‌ల‌తో చూపించిన సినిమా లెజెండ్ అని వ్యాఖ్యానించారు. నంది అవార్డులు ఎంపిక చేసిన వారికి కృత‌జ్ఞ‌త‌లని అన్నారు. సాధించిన వారంద‌రికీ అభినంద‌న‌లని చెప్పుకొచ్చారు. లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదని వ్యాఖ్యానించారు.  

More Telugu News