gun fire: అమెరికా చర్చిలో కాల్పులు... తుపాకి ఎలా కాల్చాలో చెబుతుండగా.. ప్రమాదవశాత్తు కాల్పులు!

  • న్యూయార్క్ లోని మెథడిస్ట్ చర్చ్ లో కాల్పులు
  • 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్‌ గన్‌ ను ఓపెన్‌ చేసి ,మ్యాగజైన్‌ లోడ్‌ చేసి ఎలా ఉపయోగించాలో చెప్పిన పెద్దాయన
  • ఎలా వినియోగించాలంటూ ట్రిగ్గర్ నొక్కిన మరో వ్యక్తి 
  • ఇద్దరికి తూటా గాయాలు, ఆసుపత్రికి తరలింపు

అమెరికాలోని టెక్సాస్‌, విల్సన్ కంట్రీలోని సదర్‌ ల్యాండ్‌ లో ఉన్న ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో 26 మందిని బలిగొన్న కాల్పుల ఘటన మర్చిపోకముందే... న్యూయార్క్ లోని ఈస్ట్ టెన్నిసీలోని యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ లో చోటుచేసుకున్న మరో తాజా ఘటనలో ఇద్దరికి తుపాకీ తూటా గాయాలయ్యాయి.

దాని వివరాల్లోకి వెళ్తే... ఈస్ట్‌ టెన్నెసీ చర్చ్‌ లో థాంక్స్‌ గివింగ్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు సుమారు 20 మంది సీనియర్ సిటిజన్స్ ‌హాజరయ్యారు. ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న కాల్పుల్లో బలైనవారికి సంతాపం తెలిపిన తరువాత, అదే చర్చికి చెందిన పెద్దాయన (81) ఒకరు తన వెంట తెచ్చుకున్న 38-కాలిబర్ రగ్గర్ హ్యాండ్‌ గన్‌ ను ఓపెన్‌ చేసి, మ్యాగజైన్‌ లోడ్‌ చేసి ఎలా వినియోగించాలో వారికి వివరించారు.

ఆ తర్వాత దానిని అలాగే పక్కన పెట్టారు. ఇంతలో మరొక సభ్యుడు వచ్చి, తనకు కూడా చూపించాలని అడుగుతూ ట్రిగ్గర్ నొక్కాడు. అంతే.. క్షణాల్లో సదరు పెద్దాయన అరచేతిలోంచి దూసుకెళ్లిన బుల్లెట్, పక్కనే కుర్చీలో కూర్చున్న అతని భార్య (80) పొట్ట, ముంజేతిలోకి దూసుకెళ్లింది. దీంతో హుటాహుటీన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కావడంతో, ఎవరిమీద కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

More Telugu News