లండన్ లోని అంబేద్కర్ మెమోరియల్ ను సందర్శించిన పవన్.. విజిటర్స్ బుక్ లో ఏం రాశారంటే..!

18-11-2017 Sat 10:21
  • జాతికే గర్వకారణమైన గొప్ప నాయకుడు
  • ఆయన నుంచి ఎంతో ప్రేరణ పొందాను
  • తుది శ్వాస వదిలేంత వరకు ఆయన ఆశయాలకు కట్టుబడి పని చేస్తా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అరుదైన గౌరవం లభించింది. ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయనను ఇతర దేశాల్లోని పలు సంస్థలు గుర్తించి, సముచిత రీతిలో గౌరవిస్తున్నాయి. తాజాగా ఆయన ఇండో-యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆయనను మెమెంటోతో సత్కరించారు.

అనంతరం ఆయన లండన్ లోని అంబేద్కర్ మెమోరియల్ ను సందర్శించారు. అక్కడ ఉన్న విజిటర్స్ బుక్ లో ఆయన తన అభిప్రాయాలను రాశారు.  శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని... జాతికే గర్వకారణమైన గొప్ప నేత అంటూ అందులో పేర్కొన్నారు. అంబేద్కర్ ను తాను ఎంతో ఆరాధిస్తానని... ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానని రాశారు. జనసేన పార్టీ ద్వారా తన తుది శ్వాస వదిలేంత వరకు ఆయన ఆశయాలకు కట్టుబడే పని చేస్తానని పేర్కొన్నారు.