Jazeera Air Ways: కువైట్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి ‘చవక’ విమానం జజీరా సేవలు!

  • హైదరాబాద్-కువైట్ మధ్య ప్రతి రోజూ విమాన సర్వీసులు
  • ప్రారంభించిన కువైట్ సంస్థ జజీరా ఎయిర్‌‌వేస్
  • జనవరి నుంచి కోచి, ముంబై, అహ్మదాబాద్ నగరాల నుంచి కూడా

హైదరాబాద్ నుంచి కువైట్ వెళ్లే ప్రయాణికులకు చౌక విమానయాన సంస్థ జజీరా ఎయిర్‌వేస్ శుభవార్త చెప్పింది. కువైట్-హైదరాబాద్‌ మధ్య ప్రతీ రోజు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ రోహిత్ రామచంద్రన్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి కోచి, ముంబై, అహ్మదాబాద్ నగరాల నుంచి సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కువైట్‌లో నివసిస్తున్న 10 లక్షల మంది భారతీయులను దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. హైదరాబాద్‌కు విమానాలు నడపాల్సిందిగా యూరోపియన్ విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎస్‌జీకే కిశోర్ తెలిపారు.

More Telugu News