నాగ్, వర్మల సినిమాకు ముహూర్తం ఖరారు.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వర్మ

Fri, Nov 17, 2017, 04:46 PM
  • నవంబర్ 20న ముహూర్తం
  • అన్నపూర్ణ స్టుడియోలో తొలి షాట్
  • 30 ఏళ్లకు ఒకసారి సెంటిమెంటల్ అవుతా
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముహూర్తాన్ని వర్మ అనౌన్స్ చేశాడు. నవంబర్ 20వ తేదీన ఉదయం 10.30 గంటలకు ముహూర్తం అంటూ ఫేస్ బుక్ లో ప్రకటించాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పాడు.

తన తొలి సినిమా 'శివ'ను తన తండ్రి మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రారంభించారని... ఈ కొత్త చిత్రాన్ని తన తల్లి మరియు తన మొదటి నిర్మాతలు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్రలు ప్రారంభిస్తారని వర్మ తెలిపారు. ప్రతి మూడు దశాబ్దాలకు ఒకసారి తాను ఎమోషనల్, సెంటిమెంటల్ అవుతానని ఈ సందర్భంగా అన్నాడు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha