'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూపై రేణు దేశాయ్ కామెంట్!

17-11-2017 Fri 15:48
  • పవన్ గురించే ఎక్కువ చర్చ జరిగింది
  • నా గురించే అడగాలని చెప్పా
  • మా విడాకుల గురించి ఎక్కువ చర్చించారు
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేసిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూపై రేణుదేశాయ్ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఇంటర్వ్యూ తనకన్నా ఎక్కువగా పవన్ కల్యాణ్ గురించే కొనసాగిందని ఆమె అన్నారు. తన గురించే ప్రశ్నలు అడగాలని ఆర్కే గారిని అడిగానని... అయినప్పటికీ తమ విడాకుల గురించే ఇంటర్వ్యూలో ఎక్కువ చర్చ జరిగిందని ట్వీట్ చేశారు.