siddharth: అసలైన హారర్ మూవీ అంటే ఇదే .. 'గృహం' గురించి పబ్లిక్ టాక్!

  • ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గృహం'
  • ఉత్కంఠను రేకెత్తించే కథాకథనాలు 
  • ఊపిరి బిగపట్టేలా భయపెట్టేసే సన్నివేశాలు
  • ఇది 100 పర్సెంట్ హారర్ మూవీ అంటోన్న ఆడియన్స్    

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో సిద్ధార్థ్ కి మంచి గుర్తింపు వుంది. అందువల్లనే ఈ మూడు భాషల్లో ఆయన ఒక హారర్ థ్రిల్లర్ సినిమాను నిర్మించాడు. తమిళంలో ఈ సినిమా సిద్ధార్థ్ కి సక్సెస్ తో పాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాను 'గృహం' పేరుతో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కృష్ణ మోహన్ పేరుతో బ్రెయిన్ సర్జన్ పాత్రలో ఈ సినిమాలో సిద్ధార్థ్ నటించాడు. ఆయన భార్యగా లక్ష్మి పాత్రను ఆండ్రియా పోషించింది.

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అసలైన హారర్ మూవీ అంటే ఇదేనని అంటున్నారు. ఆసక్తిని రేకెత్తించే కథా కథనాలు .. ఉత్కంఠను కలిగించే సన్నివేశాలు ఊపిరిని బిగపట్టేలా చేశాయని చెబుతున్నారు. దర్శకుడు మిలింద్ టేకింగ్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు. చివరి 20 నిమిషాలు కుర్చీకి బిగుసుకుపోతామనీ, సిద్ధార్థ్ నటనలో కొత్త కోణం ఈ సినిమాలో కనిపిస్తుందని చెబుతున్నారు. 100 పర్సెంట్ హారర్ మూవీస్ చూడాలకునేవారికి ఇది సరైన సినిమా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.     

More Telugu News