cats: త‌ప్పిపోయిన పిల్లుల కోసం భారీ మొత్తంలో రివార్డు ప్ర‌క‌టించిన య‌జ‌మాని

  • త‌ప్పిపోయిన నాలుగు పిల్లులు
  • ఒక్క పిల్లిని ప‌ట్టుకుంటే 25వేల డాల‌ర్ల బ‌హుమ‌తి
  • అందులో రెండు పిల్లుల పేరిట గిన్నిస్ రికార్డు

సైగ్నస్‌, అర్క్చ్‌ర‌స్‌.... ఇవి అమెరికాలో డెట్రాయిడ్ ప్రాంతానికి చెందిన రెండు ప్ర‌త్యేక‌మైన పిల్లులు. ఆర్క్చ్‌ర‌స్ పేరిట ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లిగా గిన్నిస్ రికార్డు ఉంది. దీని ఎత్తు 19.05 ఇంచులు. అలాగే సైగ్న‌స్ పేరిట అత్యంత పొడ‌వైన తోక గ‌ల పెంపుడు పిల్లి అనే రికార్డు ఉంది. దీని తోక పొడ‌వు 17.5 ఇంచులు.

ఇటీవ‌ల ఆ పిల్లుల య‌జమానులు విల్, లారెన్ ప‌వర్స్ దంప‌తుల ఇంట్లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. అప్ప‌టి నుంచి ఈ రెండు పిల్లుల‌తో పాటు మ‌రో రెండు పిల్లులు సిరియ‌స్‌, యూకీలు కూడా క‌నిపించ‌డం లేదు. అయితే వీటిని వెతికి ప‌ట్టుకొచ్చిన‌వారికి భారీ మొత్తంలో బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు విల్ దంప‌తులు. ఒక్కో పిల్లికి 25 వేల డాల‌ర్ల చొప్పున నాలుగు పిల్లుల‌ను ప‌ట్టుకొచ్చిన వారికి లక్ష డాల‌ర్లు బ‌హుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న ఇచ్చారు.
 

More Telugu News