america: క్రిస్మస్ నాడు యూరప్ లో దాడులు జరిగే అవకాశం: అమెరికా

  • ఉగ్రదాడులు జరిగే అవకాశం
  • క్రిస్మస్ సందర్భంగా దాడులు
  • అప్రమత్తంగా ఉండమన్న అమెరికా పోలీస్ శాఖ 

యూరప్ దేశాలకు వెళ్లే తమ ప్రజలకు అమెరికా పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ మేరకు హెచ్చరించింది. క్రిస్మస్ నాడు యూరప్ దేశాలలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా బ్రిటన్, స్పెయిన్, స్వీడన్, రష్యా, ఫిన్ లాండ్ దేశాల్లో ఉన్న అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఐసిస్, అల్ ఖైదా ఉగ్రవాదులు ఈ దేశాలపైనే దృష్టి సారించారని తెలిపింది.

గత ఏడాది క్రిస్మస్ పర్వదినానే జర్మనీలోని బెర్లిన్ లో దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. టర్కీలో కూడా ఓ నైట్ క్లబ్ పై కాల్పులు జరపగా... 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 

More Telugu News