team india: ఏడుగురితో స్లిప్స్ లో ఫీల్డింగ్ సెట్ చేసి ఒత్తిడి పెంచిన చండిమాల్!

  • రెండో రోజు టీమిండియాను కట్టడి చేసే వ్యూహంతో బరిలో దిగిన లంకేయులు
  • స్లిప్స్ లో ఏడుగురు ఫీల్డర్లతో కట్టడి
  • చండిమాల్ వ్యూహం సత్ఫలితం... రహనే అవుట్

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలిరోజు అత్యల్ప స్కోరుకు 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాపై ఒత్తిడి పెంచేలా శ్రీలంక కెప్టెన్ చండిమాల్ స్లిప్స్ లో ఏడుగురు ఫీల్డర్లను మోహరించాడు. మిడ్ ఆన్, మిడ్ ఆఫ్ లలో ఇద్దర్ని నిలబెట్టి బౌలింగ్ చేయించాడు.

దీంతో బౌలర్లు కట్టుదిట్టంగా ఆఫ్ స్టంప్ పై బంతులు వేస్తూ వికెట్లు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యూహం ఫలితం ఇచ్చింది. దీంతో శనక వేసిన బంతిని వెంటాడిన అజింక్యా రహానే (4) కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 30 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులో పుజారా (17) కు జోడీగా రవిచంద్రన్ అశ్విన్ దిగాడు. తొలిరోజు శిఖర్ ధావన్ (8), కేెఎల్ రాహుల్ (0), విరాట్ కోహ్లీ (0) అవుట్ అయిన సంగతి తెలిసిందే. 

More Telugu News