Mahatma Gandhi: మహాత్మాగాంధీ విగ్రహానికి మాస్క్.. కాలుష్యంపై నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు

  • గాంధీ, మదర్ థెరీసా విగ్రహాలకు మాస్క్ కట్టిన ఎమ్మెల్యేలు
  • పర్యావరణ సెస్‌ వాడనందుకు నిరసన
  • అరెస్ట్ చేసిన పోలీసులు.. విడుదల

ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. కాలుష్య నివారణ కోసం ఉద్దేశించిన రూ.700 కోట్ల నిధులను ఉపయోగించనందుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన  ఎమ్మెల్యే కపిల్ మిశ్రా, బీజేపీ శాసనసభ్యుడు మంజిందర్ సింగ్‌లు నిరసనకు దిగారు. సర్దార్  పటేల్ రోడ్డులోని జ్ఞానమూర్తి విగ్రహం వద్ద ఉన్న మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా విగ్రహాలకు మాస్క్ కట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కాసేపటి తర్వాత వదిలిపెట్టారు.

ఈ సందర్భంగా మంజిందర్ సింగ్ మాట్లాడుతూ ప్రజలు కాలుష్యం బారినపడి ఇబ్బందుల పాలవుతుంటే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన విధుల నుంచి దూరంగా పారిపోతున్నారని ఆరోపించారు. మొత్తం రూ. 787 కోట్ల పర్యావరణ సెస్‌లో కేవలం రూ. 93 లక్షలు మాత్రమే వినియోగించారని పేర్కొన్నారు.

More Telugu News