Sugar: 'చక్కెరలందు మంచి చక్కెరలు వేరయా' అంటున్న శాస్త్రవేత్తలు

  • చక్కెరలపై పరిశోధనలు చేసిన యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్మ్ పాకిస్థాన్ పరిశోధకులు
  • గాయాలు మాన్పడంలో, కొత్త రక్తనాళాలు ఏర్పడడంలో చక్కెరలు తోడ్పడతాయి
  • మధుమేహం, వయసు రీత్యా తగ్గని గాయాలు మాన్పడంలో చక్కెర సాయపడుతుంది

చక్కెరలందు మంచి చక్కెరలు వేరయా అని యూకేకు చెందిన యూనివర్సిటీ ఆప్ షెఫీల్డ్, పాకిస్థాన్ కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అన్ని రకాల చక్కెరలు శరీరానికి హానికరం కాదని వారు చెబుతున్నారు. కొన్ని రకాల చక్కెరలు గాయాలు మాన్పడంలో తోడ్పడతాయని తమ పరిశోధనల్లో తేలిందని వారు తెలిపారు.

అంతే కాకుండా కొత్త రక్తనాళాలు ఏర్పడటంలో కొన్ని రకాల చక్కెర సాయపడుతుందని కూడా వారు వెల్లడించారు. దీంతో మధుమేహం, వయసు రీత్యా తగ్గని గాయాలు మాన్పడంలో చక్కెర సాయపడుతుందని తమ పరిశోధనల్లో తేలిందని వారు తెలిపారు.  

More Telugu News